‘టెంపర్’ లాంటి హిట్ కొట్టిన తర్వాత కూడా నిర్మాత బండ్ల గణేష్ తన తదుపరి సినిమాను ఇప్పటికీ మొదలుపెట్టలేదు. అయితే తాజాగా అందుతున్న సమాచారం మేరకు గణేష్ తన కొత్త సినిమాకు క్రేజీ హీరోతో కాంబినేషన్‌ను సెట్ చేసినట్లు తెలుస్తోంది. వరుస హిట్స్‌తో జోరుమీదున్న నితిన్‌తో గణేష్ తన కొత్త సినిమాను ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నితిన్ త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘అ..ఆ..’ పేరుతో ఓ సినిమా చేస్తున్నారు. ఫిబ్రవరిలో ఈ సినిమాను విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు.
ఇక ఈ సినిమా పూర్తైన వెంటనే బండ్ల గణేష్‌తో నితిన్ సినిమా ఉండనుందని సమాచారం. ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ చర్చలు మొదలైనా, మరికొన్ని రోజుల తర్వాతే అఫీషియల్ అనౌన్స్మెంట్ చేయాలనుకుంటున్నారట. ఇక ఈ క్రేజీ కాంబినేషన్‌కు దర్శకత్వం ఎవరు వహిస్తారు? సినిమా సెట్స్‌పైకి ఎప్పుడు వెళుతుందీ? అన్నది తెలియాలంటే ఇంకా కొద్దికాలం ఆగాల్సిందేనని ఇండస్ట్రీ వర్గాల అభిప్రాయం.


