లేదనకుండా సాయం చేస్తున్న బండ్ల గణేష్.!

Published on Aug 14, 2020 11:14 am IST

టాలీవుడ్ టాప్ నిర్మాతలలో ఒకరైన బండ్ల గణేష్ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా కనిపిస్తున్నారు. కేవలం తన భావాలను మాత్రమే పంచుకోవడం మాత్రమే కాకుండా ఎవరికైనా కష్టం ఉంది అని తెలిస్తే తన వంతు బాధ్యతగా చేతనైన సాయం చేసిన మరికొంతమంది పెద్దల దృష్టికి కూడా వాటిని తీసుకెళ్తున్నారు. అయితే ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా తన దగ్గరకు వస్తున్న సమస్యలను అయితే దాదాపు తానే ఆర్ధిక సాయం అందించి తన ఉదారతను చాటుకున్న వారయ్యారు.

ఓ వ్యక్తి ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నానని అందుకు తన కిడ్నీ అమ్మెందుకు సిద్ధంగా ఉన్నానని తెలుపగా ఏమాత్రం ఆలోచించకుండా అలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని తాను హెల్ప్ చేస్తానని ముందుకొచ్చారు. అలాగే ఇదే రోజున మరో రిపోర్టర్ తనకు కరోనా వచ్చిందని సాయం కోరగా వారికి కాల్ చేసి హెల్ప్ చేస్తా అని గంట వ్యవధిలోనే 2500 వారికి పంపారు. అలా ఈ మధ్య కాలంలో బండ్ల చాలా మందికే సహాయం చేశారు కానీ చాలా వరకు వెలుగులోకి రాలేదు. ఒక్కమాత్రలో చెప్పాలి అంటే టాలీవుడ్ నుంచి బండ్ల గణేష్ ఒక చిన్న సైజు సోను సూద్ లా మారారని చెప్పాలి.

సంబంధిత సమాచారం :

More