పవన్ అభిమానులకు బండ్ల గణేశ్ అదిరిపోయే ట్రీట్..!

Published on Aug 28, 2021 12:28 am IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, శృతిహాసన్ హీరోయిన్‌గా హరీశ్ శంకర్‌ దర్శకత్వంలో 2011 మే 11న వచ్చిన “గబ్బర్ సింగ్” సినిమా ఎంతటి ఘన విజయాన్ని దక్కించుకుందో అందరికీ తెలిసిందే. ఈ బ్లాక్ బస్టర్ హిట్ సినిమాను ప్రముఖ నిర్మాత బండ్ల గణేశ్ నిర్మించారు. అయితే ఈ హిట్ సినిమా మరోసారి థియేటర్లలో రిలీజ్ కాబోతుంది.

సెప్టెంబరు 2న పవన్‌ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ‘గబ్బర్‌ సింగ్‌’ సినిమాని మళ్లీ థియేటర్లలో రిలీజ్ చేయబోతున్నట్టు బండ్ల గణేశ్ ట్వీట్ చేశాడు. తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో సెప్టెంబరు 2వ తేదిన ‘గబ్బర్‌ సింగ్‌’ సినిమాని 100 షోలతో మళ్లీ విడుదల చేయాలనుకుంటున్నానని, థియేటర్లలో ఈ సారి పవన్‌ పుట్టినరోజు వేడుకలను జరుపుకుందామని అన్నారు. థియేటర్ల సంగతి నేను చూసుకుంటానని, ‘గబ్బర్‌ సింగ్‌’ని మరోసారి వీక్షించి పండగ చేసుకుందామని అన్నారు.

సంబంధిత సమాచారం :