టాప్ ట్రెండింగ్ లో పవన్ తో పాటు భక్తుడి స్పీచ్.!

Published on Apr 6, 2021 8:00 am IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన మోస్ట్ అవైటెడ్ కం బ్యాక్ చిత్రం “వకీల్ సాబ్” పై ఎలాంటి అంచనాలు నెలకొన్నాయో తెలిసిందే. ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమాకు సంబంధించి ప్రతీ చిన్న అంశంపై భారీ రెస్పాన్స్ అందుకుంటున్నాయి. మరి లేటెస్ట్ గా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ స్పీచ్ కు మళ్ళీ ఆల్ టైం రికార్డు స్పీచ్ వచ్చింది.

ఇక దీనితో పాటుగా ఇప్పుడు ఇదే స్పీచ్ యూట్యూబ్ లో నెంబర్ 1 స్థానంలో ట్రెండ్ అవుతూ వస్తుంది. మరి టాప్ ప్లేస్ లో పవన్ స్పీచ్ ట్రెండింగ్ లో ఉంటే ఆ తర్వాత నెంబర్ 2 స్థానంలో పవన్ కు అపారమైన భక్తుడు ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ స్పీచ్ ట్రెండ్ అవుతూ వస్తుంది.

ఇలా తన బాస్ తో పాటుగా బండ్ల కూడా వైరల్ అవుతున్నాడు. అయితే అంతకు ముందు బండ్ల స్పీచ్ శరవేగంగా నెంబర్ 1 లోకి వచ్చేసింది. తర్వాత పవన్ స్పీచ్ వచ్చి అలా కొనసాగుతుంది. మరి వీరి స్పీచ్ లు ఇంకెంత కాలం ట్రెండ్ అవుతాయో చూడాలి. ఇక వేణు శ్రీరామ్ తెరకెక్కించిన ఈ చిత్రం వచ్చే ఏప్రిల్ 9 రిలీజ్ కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

సంబంధిత సమాచారం :