బందోబస్త్ టీజర్-దేశాన్ని కాపాడే అండర్ కవర్ కాప్ స్టోరీ

బందోబస్త్ టీజర్-దేశాన్ని కాపాడే అండర్ కవర్ కాప్ స్టోరీ

Published on Jul 7, 2019 3:02 AM IST

స్టార్ హీరో సూర్య,మోహన్ లాల్ ,ఆర్య, సయేశా వంటి భారీతారాగణంతో దర్శకుడు కే వి ఆనంద్ తెరకెక్కిస్తున్న మూవీ “బందోబస్త్”. సూర్య స్పెషల్ కమాండో ఆఫీసర్ గా నటిస్తుండగా, కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ మొదటిసారి ప్రధాన మంత్రి పాత్రలో కనిపించనున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ తెలుగు,తమిళ, మరియు మలయాళ భాషలలో విడుదల కానుంది. ఈ మూవీ టీజర్ ని నేడు దగ్గుబాటి రానా విడుదల చేశారు.

దేశద్రోహులనుండి దేశాన్ని కాపాడే అండర్ కవర్ కాప్ గా సూర్య పాత్ర కనిపిస్తుంది. ఆయన దేశరక్షణ కోసం విభిన్న అవతారాలలో కనిపిస్తాడనిపిస్తుంది. ఇక కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ బాధ్యత కలిగిన దేశ ప్రధాని పాత్రలో కనిపిస్తున్నారు. ఇక మరో ప్రముఖ బాలీవుడ్ నటుడు బోమన్ ఇరానీ తన స్వార్ధం కోసం దేశప్రయోజనాలు దెబ్బతీసే బిజినెస్ మెన్ గా ఆయన పాత్ర ఉంటుంది అనిపిస్తుంది. ఇక సయేశా ఆర్య లవర్ గా, సూర్యని వెంటాడే పోలీస్ గా కనిపిస్తుంది. ఏదిఏమైనా పొలిటికల్ కంటెంట్ కలిగిన యాక్షన్ ఎంటర్టైనర్ గా బందోబస్త్ విజయం సాధిస్తుంది అనిపిస్తుంది.

టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు