సూర్య మార్కెట్ మరీ ఇంత డల్ అయిపోయిందా !

Published on Sep 23, 2019 12:00 am IST

హీరో సూర్యకి ఒకప్పుడు తెలుగులో మంచి మార్కెట్ ఉండేది. చెప్పాలంటే తెలుగునాట మంచి మార్కెట్ ఉన్న అతి కొద్ది మంది తమిళ హీరోల్లో సూర్య కుడా ఒకరు. కానీ అప్పటి పరిస్థితి ఇప్పుడు లేదు. వరుస పరాజయాలతో సూర్య మార్కెట్ బాగా దెబ్బతింది.
ఓవరాల్ కలెక్షన్స్ ఎలా ఉన్నా మొదటి రోజు ఒక మాదిరి ఓపెనింగ్స్ కూడా రావట్లేదు.

గత శుక్రవారం విడుదలైన ఆయన కొత్త చిత్రం ‘బందోబస్త్’ అతి తక్కువ ఓపెనింగ్స్ మాత్రమే తెచ్చుకుంది. ఈ ఓపెనింగ్స్ ఆయన గత చిత్రం ‘ఎన్.జీ.కె’ కంటే తక్కువే. మొదటిరోజు తెలుగు రాష్ట్రాల్లో రూ.2 కోట్ల లోపే గ్రాస్ రాబట్టిన ఈ సినిమా రెండవ రోజు బాగా క్షీణించింది. మొత్తంగా రెండు రోజులకు కలిపి గ్రాస్ రూ.3 కోట్ల లోపే ఉందట.

ఇక ప్రీ రిలీజ్ బిజినెస్ చూస్తే రూ.10 కోట్ల వరకు ఉంది. మొదటి రెండు రోజుల వసూళ్లను బట్టి బ్రేక్ ఈవెన్ సాధించడం కష్టమే అనిపిస్తోంది. మరోవైపు తమిళనాట మాత్రం సినిమా బ్రహ్మండమైన వసూళ్లతో హిట్ దిశగా దూసుకుపోతుండటం విశేషం.

సంబంధిత సమాచారం :

X
More