రెండు తెలుగు రాష్ట్రాల్లో “బంగార్రాజు” డే 1 అదిరే వసూళ్లు.!

Published on Jan 15, 2022 3:08 pm IST

అక్కినేని నాగార్జున మరియు తన కొడుకు యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్యలు హీరోలుగా కృతి శెట్టి మరియు రమ్య కృష్ణ లు హీరోయిన్స్ గా నటించిన లేటెస్ట్ చిత్రం “బంగార్రాజు”. సోగ్గాడే చిన్ని నాయన కి కొనసాగింపుగా వచ్చిన ఈ చిత్రం అన్ని అంచనాలకు తగ్గట్టుగానే మంచి టాక్ ని ఆడియెన్స్ లో సంతరించుకుంది.

మరి ఈ టాక్ కి తగ్గట్టుగా సినిమా వసూళ్లు కూడా ఏరియాల వారీగా మంచి నంబర్స్ నమోదు చేస్తుంది. అయితే ఇప్పుడు లేటెస్ట్ గా సినిమా రెండు తెలుగు రాష్ట్రాల మొదటి రోజు అన్ని ఏరియాల వసూళ్ల వివరాలు బయటకి వచ్చాయి. మరి ఎక్కడెక్కడ బంగార్రాజు ఎంతెంత వసూలు చేసాడంటే..

నైజాం – 1.73 కోట్లు
సీడెడ్ – 1.5 కోట్లు
ఉత్తరాంధ్రా – 1.2 కోట్లు
తూర్పు గోదావరి – 0.91 కోట్లు
వెస్ట్ గోదావరి – 0.93 కోట్లు
కృష్ణ – 50 లక్షలు
గుంటూరు – 1.24 కోట్లు
నెల్లూరు – 35 లక్షలు

మొత్తం – 8.36 కోట్లు షేర్ ని ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు అందుకుంది. ఇది మాత్రం గట్టి నెంబర్ అని చెప్పాలి. అలాగే ఈ రెండు మూడు రోజులు కూడా సెలవు దినాలే కావడం బంగార్రాజుకి మరింత ప్లస్ అయ్యిందని చెప్పొచ్చు. ఇక ఈ సినిమాకి అనూప్ సంగీతం అందివ్వగా జీ స్టూడియోస్ మరియు అన్నపూర్ణ స్టూడియోస్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :