సంక్రాంతి బరిలో ‘బంగార్రాజు’

Published on Mar 2, 2021 2:05 am IST

కింగ్ నాగార్జున సూపర్ హిట్ సినిమాల్లో ‘సోగ్గాడే చిన్నినాయన’ కూడ ఒకటి. 2015 లో విడుదలైన ఈ చిత్రం కుటుంబ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుని భారీ విజయాన్ని అందుకుంది. ఈ చిత్రంలో నాగార్జున చేసిన బంగార్రాజు పాత్రకు విశేషమైన స్పందన లభించింది. దీంతో దర్శకుడు కళ్యాణ్ కృష్ణ, నాగార్జున ఇద్దరూ ఆ చిత్రానికి సీక్వెల్ తీయాలని గతంలోనే నిర్ణయించుకున్నారు. సినిమాకు ‘బంగార్రాజు’ అనే టైటిల్ కూడ నిర్ణయించారు.

కానీ కొన్ని కారణాల వలన సినిమా ఆలస్యమవుతూ వచ్చింది. కథ విషయంలో నాగార్జున అంత ఈజీగా కన్విన్స్ కాలేదు. అసలు సినిమా ఉంటుందా లేదా అనే అనుమానం కూడ కలిగింది ప్రేక్షకుల్లో. కానీ ఇప్పుడు అడ్డంకులన్నీ తొలగిపోయి సినిమా పట్టాలెక్కడానికి రెడీ అయింది. అంతా అనుకున్న ప్రకారమే జరిగితే సినిమా షూటింగ్ జూన్ లేదా జూలై నుండి ఆరంభమవుతుందని నాగార్జున స్వయంగా చెప్పారు. అంతేకాదు వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదలని కూడ అన్నారు. నాగ్ ఇంత నమ్మకంగా చెప్పారంటే సినిమా మొదలవడం సంక్రాంతి బరిలో బంగార్రాజు నిలవడం ఖాయమే.

సంబంధిత సమాచారం :