నన్ను ఏ పోలీసులు అరెస్ట్ చేయలేదు – బండ్ల గణేష్‌

నన్ను ఏ పోలీసులు అరెస్ట్ చేయలేదు – బండ్ల గణేష్‌

Published on Oct 23, 2019 9:12 PM IST

బండ్ల గణేష్‌ తన అనుచరులతో కలిసి తనను బెదిరించారని పీవీపీ తాజాగా జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా బండ్ల గణేష్ పై పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. కాగా తనకు రావాల్సిన సొమ్మును తిరిగి చెల్లించమని అడిగితే.. బండ్ల గణేష్‌ మనుషులు కొంతమంది బెదిరింపులకు పాల్పడినట్టు పీవీపీ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దాంతో ఐపీసీ సెక్షన్ 448, 506, రెడ్‌విత్‌ 34 కింద బండ్ల గణేష్‌ తో పాటు నలుగురి పై జూబ్లీహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. దాంతో బండ్ల గణేష్‌ ను బంజారా హిల్స్ పోలీసులు అరెస్ట్ చేసారని వార్తలు వచ్చాయి.

అయితే తాజాగా ఈ వార్తల పై బండ్ల సోషల్ మీడియా ద్వారా స్పందించారు. బండ్ల ట్వీట్ చేస్తూ.. ‘నన్ను ఏ పోలీసులు అరెస్ట్ చేయలేదు. విచారణ కోసం పిలవడం జరిగింది. చట్టం పై గౌరవంతో వాళ్లకు సహకరిస్తున్నాను. నన్ను అరెస్టు చేస్తే నేను మీకు తెలియజేస్తాను.. మీ బండ్ల గణేష్’ అని పోస్ట్ చేశారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు