త్వరలో టీజర్ తో రాబోతున్న ‘బంజార’ !

Published on Jun 29, 2019 12:00 am IST

నాగుల్‌ దర్శకత్వంలో ట్వింకిల్‌ కపూర్, అమృత, తేజేశ్‌ వీర, హరీశ్‌ గైలి, ముఖ్య తారలుగా రాబోతున్న సినిమా ‘బంజార’. వర్కింగ్‌ యూనిట్స్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై కోయా రమేశ్‌బాబు, దేవభక్తుని నవీన్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమా టీజర్ ను త్వరలో విడుదల చేయనున్నారు. ‘టాలీవుడ్‌లో ఇంతవరకూ రాని సరికొత్త కథాంశంతో ఈ సినిమా రాబోతుందని చిత్రబృందం చెబుతుంది.

ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా జరుకుంటున్న ఈ సినిమాలోని ప్రధాన సన్నివేశాలు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగిస్తాయట. ఈ సినిమాని త్వరలోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. జీవీ, శరత్, ‘వేదం’ నాగయ్య, అనంత్, జ్యోతిశ్రీ, ‘జబర్దస్త్‌’ రాజు, అప్పారావు, శాంతి స్వరూప్, దొరబాబు తదితరులు నటించిన ఈ చిత్రానికి సమర్పణ: ఎం. నరేంద్ర. ప్రముఖ సంగీత దర్శకుడు ఘంటాడి కృష్ణ ఈ సినిమాకి సంగీతం సమకూర్చారు.

సంబంధిత సమాచారం :

More