టాలీవుడ్ లో హాట్ టాపిక్ కా బన్నీ రెమ్యూనరేషన్..!

Published on Mar 23, 2020 7:04 am IST

అల వైకుంఠపురంలో సినిమాతో నాన్ బాహుబలి రికార్డు సొంతం చేసుకున్నాడు అల్లు అర్జున్. త్రివిక్రమ్ డైరెక్టర్ లో సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ ఫ్యామిలీ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ భారీ కలెక్షన్స్ అందుకుంది. దాదాపు 150కోట్లు పైగా షేర్ సాధించినట్లు చిత్రం వర్గాలు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ తన రెమ్యూనరేషన్ భారీగా పెంచేశారని టాక్ వినబడుతుంది.

గతంలో బన్నీ రెమ్యూనరేషన్ 15కోట్ల వరకు ఉండగా దానికి రెట్టింపు ప్రస్తుత చిత్రం కోసం ఆయన తీసుకోనున్నారట. దీనితో టాలీవుల్ లో బన్నీ రెమ్యూనరేషన్ హాట్ టాపిక్ గా మారింది. సుకుమార్ దర్శకత్వంలో బన్నీ నటిస్తుండగా, మైత్రి మూవీ మేకర్స్ ఓ మూవీ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. రష్మిక మందాన హీరోయిన్ గా నటిస్తుంది. ఈ మూవీ సెకండ్ షెడ్యూల్ త్వరలో మొదలుకానుంది.

సంబంధిత సమాచారం :