బాపు బొమ్మలో చిరంజీవి పోలికలు..!

Published on Apr 9, 2020 8:25 am IST

కొద్దిరోజులుగా చిరంజీవి ట్విట్టర్ వేదికగా ఏఫ్రిల్ 8వ తేదితో తనకు ఉన్న అనుబంధం గురించి చెప్పుకుంటూ వస్తున్నారు. ఆ తేదీ రామ బంటు హనుమాన్ జయంతి కావడమే ఆ తేదికి గల విశిష్టత. అలాగే హనుమాన్ తో తనకు గల అనుబంధ గురించి ఆయన సంఘటనల వారిగా చెప్పుకుంటూ వస్తున్నారు. కాగా 2002లో బాపు గారు చిరుతో మీకు ఇష్టమైన హనుమాన్ చిత్రాన్ని గీసి ఇస్తాను అని చెప్పారట. ఆ బొమ్మ గీసిన బాపు, చిత్రాన్ని చిరంజీవికి ఇస్తూ బొమ్మ వేసేటప్పుడు మీ పోలికలే గుర్తుకు వచ్చాయండి అన్నారట. చిరు పోలికలతో బాపు గీసిన ఆ బొమ్మను రీక్రియేషన్ చేయించి చిరు తన ఇంటిలోని దేవుడు మందిరం పాలరాతి గోడపై వేయించారట.

ఇక ఈ స్టోరీని చిరు ఇంకా కొనసాగిస్తున్నారు. చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య మూవీ చేస్తున్నారు. సోషల్ అంశాలు కూడిన కమర్షియల్ ఎలిమెంట్స్ తో ఈ చిత్రం తెరకెక్కుతుండగా, కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై రామ్ చరణ్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ చిరుకి జంటగా నటిస్తుంది. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

X
More