‘బస్తీ’.. ఓ అందమైన వాస్తవిక ప్రేమకథ!

‘బస్తీ’.. ఓ అందమైన వాస్తవిక ప్రేమకథ!

Published on Jun 29, 2015 7:52 PM IST

basthi
సహజ నటి జయసుధ తనయుడు శ్రేయాన్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘బస్తీ’. వజ్మన్ ప్రొడక్షన్స్ పతాకంపై స్వీయ దర్శకత్వంలో వాసు మంతెన నిర్మించిన ఈ చిత్రం ఆడియో ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సెన్సార్ బోర్డ్ ఈ చిత్రానికి ‘యు/ఎ’ సర్టిఫికెట్ జారీ చేసింది. దీంతో అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమాను జూలై 3న విడుదల చేయనున్నామని దర్శక నిర్మాత వాసు మంతెన తెలిపారు.

సినిమా విడుదలకు సిద్ధమైన సందర్భంగా హైద్రాబాద్‌లో పాత్రికేయులతో హీరో శ్రేయాన్, దర్శక నిర్మాత వాసు మంతెన, హీరోయిన్ ప్రగతి చౌరస్యలు ముచ్చటించారు. దర్శకుడు వాసు మంతెన మాట్లాడుతూ – ”ఓ అందమైన వాస్తవిక ప్రేమకథతో ఈ చిత్రాన్ని రూపొందించాం. అనుకోకుండా ఎదురైన ఓ సమస్యను ఓ జంట ఎలా పరిష్కరించుకుంది? అనేది ప్రధానాంశం” అన్నారు.

ఇక హీరో శ్రేయాన్ మాట్లాడుతూ.. “ఈ సినిమాను అందరం ప్రేమించి చేశాం. దర్శకుడు వాసు గారికి, నాకు ఇది మొదటి సినిమా అయినా కూడా అందరం ఒక టీమ్‌లా అందరి అభిప్రాయాలు పంచుకుంటూ చేశాం. మొదట్లో కెమెరాను ఫేస్ చేయడానికి కొంత ఇబ్బంది పడ్డా. ఆ తర్వాత అంతా ఈజీ అయిపోయింది. కచ్చితంగా ఈ సినిమా ద్వారా అందరినీ మెప్పిస్తానన్న నమ్మకం ఉంది” అని అన్నారు. ఇక ఈ సినిమాకు పనిచేయడం తన అదృష్టమని, సరదా సరదాగా షూటింగ్ జరిగిందని హీరోయిన్ ప్రగతి చౌరస్య తెలిపారు.

తాజా వార్తలు