వీరు వులవల దర్శకత్వంలో బత్తుల పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘పురుష:’ చిత్రం ప్రస్తుతం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో వీక్షకులను ఆకట్టుకుంటోంది. కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై బత్తుల సరస్వతి సమర్పణలో బత్తుల కోటేశ్వరరావు ఈ చిత్రాన్ని నిర్మించారు. మే 22న థియేటర్లలో విడుదలై ఆదరణ పొందిన ఈ సినిమా, ఇటీవల ప్రముఖ డిజిటల్ వేదికలైన అమెజాన్ ప్రైమ్ వీడియో, ఆహాలలో స్ట్రీమింగ్‌కు వచ్చింది.
ఓటీటీలో విడుదలైన కొద్దిరోజుల్లోనే ఈ సినిమా ప్రముఖ స్థానాల్లో ట్రెండ్ అవుతున్నట్లు చిత్ర బృందం తెలిపింది. కుటుంబ నేపథ్యం, సమగ్ర వినోదమే ప్రధానాంశాలుగా తెరకెక్కిన ఈ చిత్రంలో కసిరెడ్డి రాజ్‌కుమార్, సప్తగిరి, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషించారు. రాయంచ కొక్కుర, విషిక, హాసిని సుధీర్ కథానాయికలుగా నటించగా, నగరంతో పాటు గ్రామీణ ప్రాంత ప్రేక్షకుల నుంచి కూడా ఈ చిత్రానికి విశేష స్పందన లభిస్తోంది.
సకుటుంబంగా చూడదగ్గ క్లీన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందడం వల్లే ఓటీటీ వేదికలపై కూడా మంచి ఆదరణ దక్కుతోందని నిర్మాతలు వెల్లడించారు.


