ఉగాదికి టైటిల్ ముహూర్తం ఫిక్స్ !

Published on Apr 11, 2021 12:30 pm IST

బోయపాటి శ్రీను – బాలయ్య బాబు సినిమాకి టైటిల్ అంటేనే పవర్ ఫల్ గా ఉంటుంది. అయితే తాజాగా ఈ సినిమా టైటిల్ ను ఎనౌన్స్ చేయడానికి ముహూర్తం ఫిక్స్ చేశారు. ఏప్రిల్ 13వ తేదీన మధ్యాహ్నం 12 గంటల 33 నిముషాలకు ఈ సినిమా టైటిల్ ను ఎనౌన్స్ చేయబోతున్నట్లు మేకర్స్ అధికారికంగా ఒక పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇక ఈ సినిమా టైటిల్ పై మాత్రం ఇప్పటికే అనేక రూమర్స్ వచ్చాయి. అందులో ప్రధానంగా ‘మోనార్క్‌’ అనే టైటిల్‌ బాగా వినిపిస్తోంది.

ఆ తరువాత ‘గాడ్ ఫాదర్’ అనే మరో టైటిల్ కూడా బాగా వినిపించింది. కాగా కథకు ఈ రెండు టైటిల్స్ పర్ఫెక్ట్ గా సరిపోతాయట. అయితే బోయపాటి మాత్రం గాడ్ ఫాదర్ అనే టైటిల్ పై ఇంట్రస్ట్ గా ఉన్నాడట. మొత్తానికి టీజర్ లో మాత్రం బాలయ్య ఎప్పటిలాగే, పవర్ ఫుల్ డైలాగ్ అండ్ ఫుల్ యాక్షన్ తో… పైగా పంచ కట్టులో వైట్ అండ్ వైట్ లో అభిమానులను బాగానే అలరించారు. ఏమైనా బాలయ్యకు ఈ సారి కూడా బోయపాటి సూపర్ హిట్ ఇస్తాడని బాలయ్య ఫ్యాన్స్ నమ్మకంగా ఉన్నారు

సంబంధిత సమాచారం :