
తెలుగు ప్రేక్షకుల మదిలో తమ ఇంట్లో కుర్రాడిలా చోటు సంపాదించుకున్న యంగ్ హీరో నాని నటించిన లేటెస్ట్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ‘భలే భలేమగాడివోయ్’. గత శుక్రవారం రిలీజ్ అయిన ఈ సినిమా థియేటర్ కి వచ్చిన ప్రతి ఒక్కరినీ కడుపుబ్బా నవ్విస్తూ చాలా అరుదుగా వచ్చే పాజిటివ్ మౌత్ టాక్ ని సంపాదించుకుంది. మారుతి డైరెక్ట్ చేసిన ఈ సినిమాకి సూపర్బ్ పాజిటివ్ మౌత్ టాక్ స్ప్రెడ్ అవ్వడంతో ఫస్ట్ వీక్ మంచి కలెక్షన్స్ నమోదయ్యాయి. చాలా ఏరియాల్లో నాని కెరీర్లో అథ్యధీక కలెక్షన్స్ సాధించిన సినిమాగా నమోదవుతోంది.
మాకు అందిన విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం కృష్ణా జిల్లాలో ‘భలే భలే మగాడివోయ్’ సినిమా మొదటి వారం మంచి కలెక్షన్స్ ని నమోదు చేసింది. ఓవరాల్ గా మొదటి వారంలో 56 లక్షల షేర్ ని సాధించింది. ఈగ తర్వాత నాని కెరీర్లో ఈ రేంజ్ ఓపెనింగ్స్ రావడం ఇదే ప్రధమం అని అక్కడి ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాని ఇంత పెద్ద విజయం చేసిన ప్రేక్షకులకు థాంక్స్ చెప్పడం కోసం ఈ రోజు సాయంత్రం విజయవాడ – గుంటూర్ హైవే లోని హాయ్ ల్యాండ్ లో సక్సెస్ మీట్ ని జరపనున్నారు. నాని సరసన లావణ్య త్రిపాటి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాని గీత ఆర్ట్స్ 2 – యువి క్రియేషన్స్ కలిసి నిర్మించారు.

