రజిని మేనియా ఆ సాహసవీరుడిని కూడా తాకింది.

Published on Feb 20, 2020 12:06 am IST

సహస వీరుడు బేర్ గ్రిల్స్ సైతం రజిని మాయలో పడిపోయారు. చాలా మంది స్టార్స్ ని చూశాను కానీ రజిని ప్రత్యేకం అంటున్నాడు. కొన్ని రోజుల క్రితం రజిని కాంత్ డిస్కవరీ ఛానెల్ లో ప్రసారం అయ్యే మాన్ వర్సస్ వైల్డ్ ప్రోగ్రామ్ లో పాల్గొన్నాడు. అతి ప్రమాదకరమైన సాహసాలకు పేరుగాంచిన బేర్ గ్రిల్స్ తో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నాడు. కర్ణాటకలో గల బందిపూర్ టైగర్ రిజర్వు ఫారెస్ట్ నందు ఈ ప్రోగ్రామ్ చిత్రీకరించారు. కొద్దిరోజులలో ఈ కార్యక్రమానికి సంబంధించిన ఎపిసోడ్స్ ప్రసారం కానున్నాయి. ఐతే బేర్ గ్రిల్స్ ట్విట్టర్ వేదికగా రజినీతో పాటు పాల్గొన్న ఎపిసోడ్ కి సంబందించిన మోషన్ పోస్టర్ పంచుకోవడంతో పాటు ఆయన్ని ఓ రేంజ్ లో పొగిడారు.

ఇక రజిని ప్రస్తుతం దర్శకుడు శివ తెరకెక్కిస్తున్న చిత్ర షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఈ చిత్రంలో కీర్తి సురేష్ తో పాటు, సీనియర్ హీరోయిన్ మీనా కూడా నటిస్తున్నారు. ఈ ఏడాది రజిని సంక్రాతి కానుకగా దర్బార్ మూవీని విడుదల చేశారు. దర్శకుడు మురుగదాస్ తెరకెక్కించిన ఈ చిత్రం తమిళంలో హిట్ గా నిలిచింది.

సంబంధిత సమాచారం :

X
More