దర్శకుడిగా నిర్మాతగా తక్కువ కాలంలో లెక్కకు మించిన చిత్రాలు చేస్తూ ఉంటాడు వర్మ. కొద్దిరోజుల క్రితం అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు అనే వివాదాస్పద చిత్రంతో నానా హంగామా చేసిన వర్మ ఎట్టకేలకు దానిని విడుదల చేసి తన పంతం నెగ్గించుకున్నారు. ఇక వర్మ పర్యవేక్షణలో తెరకెక్కుతున్న రొమాంటిక్ మూవీ ‘బ్యూటిఫుల్’. తనకు బాలీవుడ్ లో అత్యంత పేరుతెచ్చిపెట్టిన రంగీలా చిత్రానికి అంకితమంటూ చెప్పుకుంటున్న వర్మ ఈ చిత్ర విడుదల తేదీ ప్రకటించారు.
2020 మొదటి రోజు అనగా జనవరి 1న బ్యూటిఫుల్ మూవీ విడుదలకానుంది. నేడు ఈ చిత్ర రిలీజ్ డేట్ పోస్టర్ విడుదల చేశారు. అలాగే ఐ టి సి కోహినూర్ నందు మ్యూజిక్ ఆడియో వేడుక నిర్వహించారు. దర్శకుడు అగస్త్య మంజు ఈ చిత్రాన్ని తెరకెక్కించగా, ట్. శ్రీధర్ మరియు టి నరేష్ కుమార్ నిర్మిస్తున్నారు. పార్థు సూరి, నాయనా గంగూలీ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం రవిశంకర్ అందించారు.
