మేఘా ఆకాష్ నెక్స్ట్ కి బ్యూటిఫుల్ టైటిల్ ఫిక్స్.!

Published on Jun 7, 2022 1:30 pm IST


యంగ్ టాలెంట్ హీరోయిన్ మేఘా ఆకాష్ అలాగే రాహుల్ విజయ్ లు జంటగా నటిస్తున్న సినిమాకు ఇపుడు మేకర్స్ ఒక బ్యూటిఫుల్ టైటిల్ ని అనౌన్స్ చేశారు. మరి ఈ సినిమాకి “మాటే మంత్రము” అనే టైటిల్ ని రాహుల్ విజయ్ బర్త్ డే సందర్భంగా చేశారు. ఈ చిత్రాన్ని మేఘ ఆకాష్ తల్లి బిందు ఆకాష్ సమర్పిస్తున్నారు.

కోట ఫిలిం ఫ్యాక్టరీ & ట్రిప్పి ఫ్లిక్స్ స్టూడియోస్ బ్యానర్స్ పై ఎ సుశాంత్ రెడ్డి, అభిషేక్ కోట నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సుశాంత్ రెడ్డి కథను అందించగా…అభిమన్యు బద్ది దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం 90 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకుంది.

ఈ సందర్భంగా *నిర్మాతలు ఎ సుశాంత్ రెడ్డి, అభిషేక్ కోట మాట్లాడుతూ…”మా హీరో పుట్టినరోజు సందర్భంగా చిత్ర టైటిల్ ను అనౌన్స్ చేస్తున్నాం. ఈ చిత్రానికి “మాటే మంత్రము” అనే పేరును ఖరారు చేశాం. ఇది మా సినిమాకు యాప్ట్ టైటిల్. తొలి షెడ్యూల్ హైదరాబాద్ లో, రెండో షెడ్యూల్ గోవాలో చిత్రీకరించాం. ప్రస్తుతం 90 శాతం షూటింగ్ పూర్తయింది. గోవా బ్యాక్ డ్రాప్ లో జరిగే రొమాంటిక్ ఎంటర్ టైనర్ ఇది. ఆద్యంతం ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది” అని తెలిపారు.

సాంకేతిక నిపుణులు – సంగీతం: హరి గౌర, ఎడిటర్: ప్రవీణ్ పూడి, ఆర్ట్ డైరెక్టర్ : కె. వి రమణ, సినిమాటోగ్రఫీ : మనోజ్ రెడ్డి, పి.ఆర్.ఓ : జిఎస్ కె మీడియా, డిజిటల్ మార్కెటింగ్: టాక్ స్కూప్, నిర్మాత: ఏ.సుశాంత్ రెడ్డి & అభిషేక్ కోట, సమర్పణ: బిందు ఆకాష్, నిర్మాణ సంస్థలు: కోటా ఫిలిం ఫ్యాక్టరీ & ట్రిప్పి ఫ్లిక్స్ స్టూడియోస్, కథ : ఏ.సుశాంత్ రెడ్డి, దర్శకత్వం – అభిమన్యు బద్ది లు వ్యవహరిస్తున్నారు.

సంబంధిత సమాచారం :