జనవరి 23న సందీప్ కిషన్ ‘బీరువా’

జనవరి 23న సందీప్ కిషన్ ‘బీరువా’

Published on Jan 13, 2015 12:00 PM IST

Beeruva1
‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’, ‘రారా కృష్ణయ్య’ సినిమాలతో బాక్స్ ఆఫీసు వద్ద విజయాలు అందుకున్న యంగ్ హీరో సందీప్ కిషన్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు. అందులో ఇప్పటికే బీరువా అన్ని పనులు పూర్తి చేసుకోగా, ‘టైగర్’ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. తాజా సమాచారం ప్రకారం బీరువా సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకొని సెన్సార్ నుండి ‘యు/ఏ’ సర్టిఫికేట్ అందుకుంది.

అలాగే ఈ చిత్ర హీరో సందీప్ కిషన్ ఈ సినిమాని జనవరి 23న రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ నిర్మాతల నుంచి వస్తున్న ‘బీరువా’ సినిమా జనవరి 23న రిలీజ్ కానుంది. బోలెడంత నవ్వు, కొద్దిగా ప్రేమ, ఒక బీరువా కలిసి వస్తున్నాయని’ సందీప్ కిషన్ ట్వీట్ చేసాడు. సందీప్ కిషన్ – సురభి జంటగా నటిస్తున్న నటిస్తున్న ఈ సినిమాకి ‘నా ఊపిరి’ ఫేం కన్మణి డైరెక్టర్. ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ – ఉషా కిరణ్ మూవీస్ వారు కలిసి నిర్మిస్తున్నారు.

తాజా వార్తలు