మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కించిన సాలిడ్ ఎమోషనల్ డ్రామా పెద్ది కోసం అందరికీ తెలిసిందే. మంచి అంచనాలు నడుమ వచ్చిన ఈ సినిమా ఏపీ, తెలంగాణాలో మంచి వసూళ్లు రాబట్టింది. అయితే సినిమా విడుదల అయ్యిన కొన్ని రోజుల తర్వాత నైజాంలో టికెట్ ధరలను తగ్గించారు. కానీ లేటెస్ట్ గా చిత్ర యూనిట్ పెద్ది టికెట్ ధరలను మరింత తగ్గించినట్టు కన్ఫర్మ్ చేసారు.
ఇవాళ్టి నుంచి తెలంగాణ సింగిల్ స్క్రీన్స్ లో పెద్ది సినిమాకి హై క్లాస్ టికెట్ కేవలం 105 రూపాయలు మాత్రమే కనిష్టంగా 50 రూపాయలు పెట్టారు. సో ఓటీటీ రిలీజ్ కి ముందు మరోసారి తక్కువ ధరలో పెద్ది సినిమా చూడాలి అనుకునేవారికి ఇది మంచి అవకాశం అని చెప్పొచ్చు. ఇక ఈ సినిమాకి రెహమాన్ సంగీతం అందించారు అలాగే వృద్ది సినిమాస్ నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.


