ఎస్‌ఆర్‌ఎస్ అసోసియేట్స్, మీటీవీ సమర్పిస్తున్న చిత్రం చిత్రసేన. నర్సింహరాజు రాచూరి, అజయ్ మైసూర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం దిలీప్ కుమార్ సల్వాది దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం ఉగాది సందర్భంగా రామానాయుడు స్టూడియోలో ప్రారంభమైంది. అజయ్‌మైసూర్, నర్సింహరాజు కలిసి కెమెరాస్వచాన్ చేయగా, లగడపాటి శ్రీధర్ క్లాప్ కొట్టారు.
ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో…లగడపాటి శ్రీధర్ మాట్లాడుతూ… ఈ చిత్రం ఎక్కువగా విఎఫ్‌ఎక్స్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే చిత్రమిది. పీరియాడిక్ చిత్రాలకు పెద్దపీట పీట వేస్తున్న తరుణంలో పీరియడిక్ చిత్రంగా వస్తుంది. అంతకు ముందు దిక్చూచి చిత్రం తీసిన దర్శకుడు దిలీప్ సల్వాది దీంట్లో హీరోగా నటించి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్ర ట్రైలర్‌కు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అని అన్నారు.
అజయ్ ప్రొడ్యూసర్ మాట్లాడుతూ… నేను ఆస్ట్రేలియా నుంచి వచ్చాను. అక్కడ నాకు ఒక టీవీ ఛానల్ ఉంది. మీ టీవీ అనే ఛానల్. దిలీప్ నటించిన దిక్సూచి చిత్రం చూశాను నాకు నచ్చింది. ఆయన చెప్పిన కథ నచ్చి ప్రొడ్యూస్ చెయ్యడానికి ఒప్పుకున్నాను. దిలీప్ రాజు మళ్ళీ కాంబినేషన్ బావుంటుంది. గతంలో వీరిరువి కాంబినేషన్‌లో చేసిన దిక్సూచి కూడా విడుదలకు సిద్ధంగా ఉంది త్వరలో మీ ముందుకు వస్తారు.
దిలీప్ కుమార్ సల్వాది మాట్లాడుతూ… నాకు ఈ రోజు చాలా ఆనందంగా ఉంది ఆదే ప్రొడ్యూసర్‌తో కలిసి చెయ్యడం అనేది సంతోషమైన విషయం. అంతే కాక మరో ప్రొడ్యూసర్ అజయ్‌గారు కూడా యాడ్ అయ్యారు. ఏప్రిల్ మూడవ వారంలో దిక్సూచి విడుదల చేస్తాము అని అన్నారు.


