చరణ్ – ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’ లేటెస్ట్ అప్ డేట్ !

చరణ్ – ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’ లేటెస్ట్ అప్ డేట్ !

Published on Jan 21, 2019 11:24 AM IST

రామ్ చరణ్ – జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రాబోతున్న భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’ ఇప్పటికే మొదటి షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. కాగా ఈ చిత్రం రెండవ షెడ్యూల్ ఈ రోజు నుండి మొదలవుతుందని చిత్రబృందం ట్విట్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించింది. ఈ షెడ్యూల్ లో చెయ్యబోయే సన్నివేశాల్లో ఎన్టీఆర్ రఫ్ లుక్ లో కనిపిస్తాడట.

ఇక ‘బాహుబలి’ తరవాత రాజమౌళి చేస్తున్న సినిమా కావడం, ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తుండటంతో ఈ సినిమా పై ఆరంభం నుండి భారీ అంచనాలు నెలకొన్నాయి. భారీ బడ్జెట్ తో డివివి ఎంటర్ టైన్మెంట్స్ పతాకం ఫై డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు