టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రస్తుతం ‘హైందవ’ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక నేడు(జనవరి 3) ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన సినిమాలకు సంబంధించి వరుస అప్డేట్స్ ఇస్తున్నారు. ఇప్పటికే హైందవ మూవీ నుంచి ఓ సాలిడ్ పోస్టర్ రిలీజ్ అవగా, తాజాగా ఆయన తన నెక్స్ట్ చిత్రాన్ని కూడా ప్రకటించారు.
డివోషనల్ టచ్‌తో సాగే ఈ సినిమాకు ‘రామం- ది రైజ్ ఆఫ్ అకీరా’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు మేకర్స్. ఈ సినిమాను లోకమాన్య డైరెక్ట్ చేస్తుండగా వేణు దోనెపూడి ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-లుక్ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇక ఈ పోస్టర్ గమనిస్తే, ఇందులో జై శ్రీరామ్ అనే ట్యాగ్ ఇచ్చారు. దీంతో ఈ సినిమాకు డివోషనల్ టచ్ కూడా ఉండబోతుందని అర్థమవుతుంది.
ఈ సినిమాకు సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ అందించనున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్‌ను త్వరలో ప్రారంభించి వీలైనంత త్వరగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్ ప్రయత్నిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


