కామెడీ చేస్తోన్న బెల్లంకొండ యంగ్ హీరో !

Published on Feb 29, 2020 2:22 am IST

ప్రముఖ నిర్మాత బెల్లంకొండ గణేష హీరోగా ఇంట్రడ్యూజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ‘ప్రేమ ఇష్క్ కాదల్, సావిత్రి’ చిత్రాల దర్శకుడు పవన్ సాధినేని ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. గతేడాది చివర్లో మొదలైన ఈ చిత్రం ఫస్ట్ షెడ్యూల్ పూర్తయ్యాక కాస్త బ్రేక్ అనంతరం ఇటీవలే తిరిగి మొదలైందన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం బెల్లంకొండ గణేష్ పై కొన్ని కామెడీ సీన్స్ చేస్తోన్నట్లు తెలుస్తోంది.

వాస్తవికతకు దగ్గరగా ఉండే సరికొత్త తరహా ప్రేమ కథతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ‘రేసు గుర్రం, లక్ష్మీ, లక్ష్యం’ వంటి సినిమాలను నిర్మించిన ప్రముఖ నిర్మాత నల్లమలుపు బుజ్జి నిర్మిస్తున్నారు. హైదరాబాద్ షెడ్యూల్ అనంతరం అమెరికాలో ఒక షెడ్యూల్ జరపనున్నారు. ‘అందాల రాక్షసి, అర్జున్ రెడ్డి, ఆదిత్య వర్మ, ఫేమ్ రదన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి కార్తిక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :