మరో చిత్రాన్ని ట్రాక్‌లో పెట్టేసిన బెల్లంకొండ గణేశ్..!

Published on Aug 23, 2021 9:00 pm IST

ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేశ్ రెండో కుమారుడు బెల్లంకొండ గణేశ్ త్వరలోనే తెలుగు ప్రేక్షకులను అలరించనున్నాడు. ప్రస్తుతం గణేశ్ నటిస్తున్న రెండు చిత్రాలు తుదిదశ షూటింగ్‌ని జరుపుకుంటున్నాయి. అయితే తాజాగా గణేశ్ తన మూడో చిత్రాన్ని కూడా మొదలెట్టేశాడు. ‘నాంది’ చిత్రాన్ని నిర్మించిన ఎస్‌.వి. 2 ఎంటర్‌టైన్‌మెంట్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, తేజ శిష్యుడు రాకేశ్ ఉప్పలపాటిని దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.

నేడు పూజా కార్యక్రమాలతో ఈ చిత్రం లాంఛనంగా ప్రారంభమయ్యింది. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ నిర్మాత దిల్ రాజు క్లాప్ కొట్టగా, అల్లరి నరేశ్ కెమెరా స్విచ్చాన్ చేశారు. థ్రిల్లర్ నేపథ్యంలో సాగే ఈ చిత్రం యొక్క షూటింగ్ వచ్చే నెల నుండి ప్రారంభం కానున్నట్టు తెలుస్తుంది. ఈ చిత్రానికి మహతి స్వర సాగర్‌ సంగీతం అందిస్తుండగా, చోటా కె ప్రసాద్ ఎడిటర్‌గా, అనిత్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నాడు.

సంబంధిత సమాచారం :