కోలీవుడ్ సూపర్ హిట్ మూవీ రీమేక్ లో బెల్లంకొండ హీరో !

కోలీవుడ్ సూపర్ హిట్ మూవీ రీమేక్ లో బెల్లంకొండ హీరో !

Published on Jan 23, 2019 4:00 AM IST

కోలీవుడ్లో గత ఏడాది విడుదలై సూపర్ హిట్ ను సొంతం చేసుకున్న చిత్రం ‘రట్సాసన్’. విష్ణు విశాల్ హీరోగా సైకాజికల్ థ్రిల్లర్ నేపథ్యంలో రామ్ కుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఇక ఇప్పుడీ ఈ చిత్రం తెలుగులో రీమేక్ కానుంది.

ఇటీవల వరుస పరాజయాలను ఖాతాలో వేసుకున్న యువ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఈ రీమేక్ లో నటించనున్నాడు. ఈ సారి విజయం కోసం ఈ సూపర్ హిట్ రీమేక్ నే నమ్ముకున్నాడు ఈయువహీరో. ప్రస్తుతం ఈచిత్రంకోసం బాడీ ని బిల్డ్ చేసే పనిలో వున్నాడు సాయి శ్రీనివాస్. ‘వీర, రైడ్’ చిత్రాల దర్శకుడు రమేష్ వర్మ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నాడు. త్వరలోనే ఈచిత్రంఫై మరిన్ని వివరాలు వెలుబడనున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు