పబ్లిసిటీ కోసం కోట్లు ఖర్చుపెడుతున్న బెల్లంకొండ సురేష్

పబ్లిసిటీ కోసం కోట్లు ఖర్చుపెడుతున్న బెల్లంకొండ సురేష్

Published on Jul 11, 2014 12:50 PM IST

bellamkonda
బెల్లంకొండ శ్రీనివాస్ ని తెరకు ఘనంగా పరిచయం చేసే నేపధ్యంలో ఏ చిన్న అంశాన్ని ఆయన తండ్రి విడిచిపెట్టడంలేదు. ఈ సినిమాలో వి.వి వినాయక్ లాంటి టాప్ డైరెక్టర్ లని, సమంత మరియు తమన్నా లాంటి స్టార్ హీరోయిన్లని తీసుకున్నాడు. దేవి చేత స్వరాలు సమకూర్చి భారీ సెట్ లలో చిత్రీకరించారు

ఇప్పుడు పబ్లిసిటీకోసం బెల్లంకొండ కోట్లకు కోట్లు ఖర్చుపెడుతున్నట్టు సమాచారం. మీడియా మరియు యాడ్ లకు లెక్కలేకుండా ఖర్చు పెట్టేయమని ఆర్డర్ లు జారీ చేసాడట. ఇప్పటికే నగరంనిండా చాలా హోగార్డింగ్ లు పెట్టేశారు

ఇక టి.వి లో యాడ్ లకు లెక్కలేదు. మరి బెల్లంకొండ సురేష్ కల ఫలించనుందా అన్న ప్రశ్నకు జూలైలో సమాధానం దొరకనుంది

తాజా వార్తలు