మరోసారి సిద్దమంటున్న బెల్లంకొండ హీరో !

మరోసారి సిద్దమంటున్న బెల్లంకొండ హీరో !

Published on Jun 1, 2019 12:00 AM IST

Rakshasudu

2017లో వచ్చిన ‘జయ జానకి నాయక’ తర్వాత హీరో బెల్లోండా శ్రీనివాస్ ఖాతాలో మరో హిట్ పడలేదు. ‘సాక్ష్యం, కవచం’ ఈమధ్యే వచ్చిన ‘సీత’ ఇలా మూడు చిత్రాలు ఆయనకు ఆశించిన ఫలితాన్ని, నిలదొక్కుకోవడానికి కావాల్సిన ఫలితాన్ని ఇవ్వలేదు. అయినా ఈ యువ హీరో ఏమాత్రం నిరుత్సాహపడటంలేదు. రెట్టించిన ఉత్సాహంతో ఇంకో సినిమా చేస్తున్నాడు.

అదే ‘రాక్షసుడు’. ఇది తమిళంలో మంచి విజయాన్ని అందుకున్న ‘రాక్షసన్’ సినిమాకు రీమేక్. రమేష్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం చివరి దశ పనుల్లో ఉంది. ఇప్పటికే ఫస్ట్ లుక్ రిలీజ్ కాగా రేపు జూన్ 1వ తేదీన టీజర్ విడుదలకానుంది. ఈ సినిమా తప్పకుండా తనకు విజయాన్ని అందిస్తుందని శ్రీనివాస్ భావిస్తున్నారు. సత్యనారాయణ కోనేరు నిర్మిస్తున్న ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ కథానాయకిగా కనిపించనుంది.

తాజా వార్తలు