గ్రాండ్ గా లాంచ్ కానున్న బెల్లంకొండ శ్రీను బాలీవుడ్ ప్రాజెక్ట్.!

Published on Jul 15, 2021 2:00 pm IST


మన టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రస్తుతం పలు టాలీవుడ్ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అలాగే టైం చూసి ఊహించని విధంగా డైరెక్ట్ గా బాలీవుడ్ ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేసేసాడు. పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ కెరీర్ లో భారీ హిట్ “ఛత్రపతి” రీమేక్ తో బెల్లంకొండ శ్రీను బాలీవుడ్ మార్కెట్ లోకి లాంచ్ అవ్వడానికి రెడీ అయ్యాడు. మరి ఈ చిత్రంను ప్రముఖ దర్శకుడు వివి వినాయక్ దర్శకత్వం వహించనున్నారు.

మరి ఈ భారీ చిత్రాన్ని రేపు గ్రాండ్ గా హైదరాబాద్ లో లాంచ్ చెయ్యడం ఫిక్స్ అయ్యింది. అలాగే ఇప్పటికే ఒక భారీ సెట్టింగ్ ను కూడా వేసిన సంగతి తెలిసిందే.. అయితే బెల్లంకొండ శ్రీనివాస్ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడానికి అక్కడి ఆడియెన్స్ తన ప్రతీ సినిమాకు కూడా సాలిడ్ రెస్పాన్స్ ఇస్తుండడమే ప్రధాన కారణం అని చెప్పాలి. అందుకే ఈ సినిమా మాత్రం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఉండాలని సన్నాహాలు చేస్తున్నాడు. అలాగే ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ పెన్ స్టూడియోస్ వారు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :