మన టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోస్ లో ఒకరైన విజయ్ దేవరకొండ హీరోగా నటించిన అవైటెడ్ చిత్రం “కింగ్డమ్” ఈ మే 30న గ్రాండ్ గా రిలీజ్ కి వస్తున్న సంగతి తెలిసిందే. విజయ్ కెరీర్లోనే అత్యధిక హైప్ దీనిపై ఉంది. మరి ఈ చిత్రానికి ప్రస్తుతానికి ఎలాంటి పోటీ లేదు అనుకున్నారు కానీ లేటెస్ట్ గా మాత్రం మరో చిత్రం పోటీకి వచ్చింది.
బెల్లం కొండ సాయి శ్రీనివాస్ అలాగే మంచు మనోజ్ మరియు నారా రోహిత్ ల కలయికలో దర్శకుడు విజయ్ కనక మేడల తెరకెక్కించిన చిత్రమే “భైరవం” మరి ఈ చిత్రం సరిగ్గా కింగ్డమ్ రోజునే ఢీ కొట్టనున్నట్టు ఇపుడు ఫిక్స్ అయ్యింది. మే 30 రిలీజ్ డేట్ తోనే మేకర్స్ అనౌన్స్ చేయగా ఈ రెండు సినిమాలు ఆరోజున అయితే క్లాష్ కానున్నాయి. మరి ఈ రెండు చిత్రాల నడుమ పోటీ ఎలా ఉంటుందో చూడాలి.