ఈ శుక్రవారం విడుదలైన ‘అల్లుడు శీను’ సినిమా హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమా ద్వారా హీరోగా పరిచమైన నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడు సాయి శ్రీనివాస్ ప్రేక్షకులతో పాటు పరిశ్రమ వర్గాల దృష్టిని ఆకర్షించాడు. నటనతో పాటు డాన్సులు, ఫైట్స్ లలో అందరిని మెప్పించాడు.
‘అల్లుడు శీను’ తర్వాత సాయి శ్రీనివాస్ సుకుమార్, శ్రీను వైట్ల దర్శకత్వంలో సినిమాలు చేసే అవకాశం ఉంది. త్వరలో ఈ సినిమాలకు సంబందించిన అధికారిక ప్రకటన విడుదల చేస్తారని ఫిల్మ్ నగర్ టాక్.
నిర్మాత బెల్లంకొండ సురేష్.. తన కుమారుడి కెరీర్ పై చాలా శ్రద్ధ తీసుకుంటున్నారు. తోలి సినిమాతో ప్రేక్షకులలో మంచి గుర్తింపు పొందడంతో.. తర్వాత సినిమాలను అగ్ర దర్శకులతో ప్లాన్ చేసి హీరోగా సాయికి గట్టి పునాది వేయాలని ప్రయత్నిస్తున్నారు.


