బెల్లంకొండ రీమేక్ సినిమాకు వరుణుడి షాక్

Published on Jun 4, 2021 3:01 am IST

యంగ్ హీరో బెల్లంకొండ సాయిశ్రీనివాస్ హిందీలోకి ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్న సంగతి తెలిసిందే. హిందీలోకి మంచి యాక్షన్ కథతో దిగాలనుకుంటున్న బెల్లంకొండ అందుకు ప్రభాస్ హిట్ మూవీ ‘ఛత్రపతి’ని చూజ్ చేసుకున్నారు. వివి.వినాయక్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్ శివార్లలో భారీ సెట్ వేశారు ఆర్ట్ డైరెక్టర్ సునీల్ బాబు. 6 ఎకరాల విస్తీర్ణంలో ఈ విలేజ్ సెట్ వర్క్ చేశారట. దీని కోసం భారీ ఎత్తున ఖర్చు చేసినట్లుగా తెలుస్తోంది.

అయితే సెట్ వర్క్ పూర్తికానున్న దశలో కరోనా సెకండ్ వేవ్ రావడంతో ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి. సెట్ మొత్తం అలాగే ఉండిపోయింది. గత కొన్నిరోజులుగా హైదరాబాద్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల కారణంగా ఆ విలేజ్ సెట్ డ్యామేజ్ అయింది. టీమ్ షూటింగ్ తిరిగి ప్రారంభించాలి అనుకున్నప్పుడు మళ్లీ సెట్ నిర్మాణం చేపట్టాల్సిందే. ఈ నష్టంతో నిర్మాతకు వ్యయం, సమయం రెండూ వృధా అయినట్టే. ఇకపోతే శ్రీనివాస్ ఇటీవల తమిళంలో విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకున్న ధనుష్ చిత్రం ‘కర్ణన్’ను కూడ రీమేక్ చేయనున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడికానున్నాయి.

సంబంధిత సమాచారం :