నా పెళ్ళాం నిప్పురా.. సోషల్ మీడియా బాగానే ఫాలో అయ్యిన కొత్త పెళ్లి కొడుకు

నా పెళ్ళాం నిప్పురా.. సోషల్ మీడియా బాగానే ఫాలో అయ్యిన కొత్త పెళ్లి కొడుకు

Published on May 2, 2026 12:00 PM IST

లేటెస్ట్ గానే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మరియు కావ్య రెడ్డిలు వివాహం ఎంతో ఘనంగా తిరుమలలో జరిగిన సంగతి తెలిసిందే. ఈ అనంతరం తమ రిసెప్షన్ కూడా అట్టహాసంగా అనేమంది ప్రముఖుల సమక్షంలో జరిగింది. అయితే ఈ నవ వధూవరులపై కొన్ని ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో ఎంతో చూడముచ్చటగా కనిపిస్తూ వైరల్ గా కూడా మారాయి.

అయితే లేటెస్ట్ గా బెల్లంకొండ శ్రీనివాస్ ట్విట్టర్ లో చేసిన పోస్ట్ మంచి ఫన్ గా మారింది. తన భార్యతో కలిసి కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ ని షేర్ చేసుకుని తన భార్యని పరిచయం చేస్తూ ‘నా పెళ్ళాం నిప్పురా’ అంటూ మంచి ఫన్ ని జెనరేట్ చేసాడు. అయితే ఈ పర్టిక్యులర్ లైన్ ఎందుకు పెట్టాడో అనేది చాలామందికి ఈపాటికే అర్ధం అయ్యి ఉంటుంది.

తన జయ జానకి నాయక సినిమాలో నటుడు జయప్రకాష్, రకుల్ ప్రీత్ సింగ్ ఇంకా తనపై ఓ ఎమోషనల్ సీన్ లో నీ కూతురు నిప్పురా అనే సీన్ ఓ రేంజ్ లో ఈ మధ్య వైరల్ గా మారిపోయింది. తెలంగాణ, వైజాగ్, జపాన్ వెర్షన్ లు అంటూ ఇప్పటికీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియో స్టైల్ లోనే ఒరిజినల్ గా తాను చెప్పి మరోసారి హైలైట్ గా నిలిచాడు. ఈ ఫన్ మూమెంట్ ని పక్కన పెడితే సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ఈ యువ జంటకి తమ బెస్ట్ విషెస్ అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు