బెల్లంకొండ శ్రీనివాస్ కొత్త సినిమా సెట్టైంది !
Published on Feb 20, 2018 3:20 pm IST

ఇటీవలే ‘జయ జానకి నాయకతో’ గ్రాండ్ కమర్షియల్ సక్సెస్ అందుకున్న యివా హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ప్రస్తుతం శ్రీవాస్ డైరెక్షన్లో ‘సాక్ష్యం’ అనే సినిమా చేసున్నాడు. మే నెలలో ఈ చిత్రం రిలీజ్ కానుండగా మరొక సినిమాను సెట్ చేసి పెట్టుకున్నాడు శ్రీనివాస్. ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు శ్రీనివాస్ డైరెక్ట్ చేయనున్నాడు.

వంశధార క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మితంకానున్న ఈ చిత్రాన్ని నవీన్ సొంతినేని నిర్మించనున్నాడు. ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు థమన్ సంగీతాన్ని అందివ్వనుండగా ఛోటా కె నాయుడు సినిమాటోగ్రఫి భాద్యతలు నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 22న లాంచ్ కానున్న ఈ చిత్రం యొక్క రెగ్యులర్ షూట్ మార్చి నెలలో మొదలవుతుంది. ఒక కొత్త దర్శకుడితో శ్రీనివాస్ పనిచేయనుండటం ఇదే మొదటిసారి కావడం విశేషం.

 
Like us on Facebook