ఎన్.టి.ఆర్ కి సింగల్ షాట్ పేమెంట్ చేసిన బెల్లంకొండ

ఎన్.టి.ఆర్ కి సింగల్ షాట్ పేమెంట్ చేసిన బెల్లంకొండ

Published on Mar 14, 2013 8:46 AM IST

NTR-Bellamkonda-Suresh

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ని ఓ సినిమాకి హీరోగా బుక్ చేసుకోవాలంటే బాగా ఖర్చుతో కూడుకున్న పని ఎందుకంటే ప్రస్తుతం ఇండస్ట్రీలో భారీ పారితోషికం తీకుకుంటున్న వారిలో ఎన్.టి.ఆర్ కూడా ఒకరు. మామూలుగా స్టార్ హీరోలతో సినిమా ఒప్పుకునేటప్పుడు రెమ్యునరేషన్లో కొంత అమౌంట్ అడ్వాన్స్ గా ఇస్తారు, ఆ తర్వాత మిగతా అమౌంట్ ని షూటింగ్ సమయంలో రెండు, మూడు వాయిదాలలో ఇస్తారు.

కానీ ఇండస్ట్రీలో వినిపిస్తున్న తాజా సమాచారం ప్రకారం నిర్మాత బెల్లంకొండ సురేష్ ఎన్.టి.ఆర్ కి సింగల్ షాట్ లో పారితోషికం మొత్తం ఇచ్చేసి అందరినీ షాక్ కి గురి చేసారు, అది నిజం కూడా. మామూలుగా ఎన్.టి.ఆర్ ప్రతి మూవీకి 13 -15 కోట్ల మధ్య పారితోషికం తీసుకుంటాడు. ఈ అమౌంట్ ని బెల్లంకొండ ఒకేసారి అతనికి చెల్లించేశాడు.
ఈ సినిమాకి సంతోష్ శ్రీనివాస్ డైరెక్టర్. ఈ సినిమాల సమంత ఎన్.టి.ఆర్ సరసన జోడీ కట్టనుంది. ఇటీవల కొంత కాలంగా బెల్లంకొండ సురేష్ చేస్తున్న పనులకు మిగతా ప్రొడ్యూసర్స్ అంతా ఆశ్చర్యానికి గురవుతూన్నారు. అందుకే బెల్లంకొండని అంత ఈజీగా అంచనా వేయలేకపోతున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు