రాక్షసుడు టీజర్- సైకో కిల్లర్ ని వెంటాడే పోలీస్ స్టోరీ

Published on Jun 1, 2019 10:51 am IST

బెల్లంకొండ సాయి శ్రీనివాస్,అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలలో రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ “రాక్షసుడు”. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో వస్తున్న ఈ మూవీ టీజర్ ని ఇప్పుడే కొద్దిసేపటి క్రితం చిత్ర యూనిట్ విడుదల చేసింది.

స్కూల్ కి వెళ్లే టీనేజ్ అమ్మాయిలను కిడ్నాప్ చేసి అతి క్రూరంగా హింసించి చంపే సమాజం పట్ల కక్ష కట్టిన ఓ సైకో కథే ఈ మూవీ అని తెలుస్తుంది. వరుసగా జరుగుతున్న అమ్మాయిల హత్యలకు కారకుడైన ఆ సైకో కిల్లర్ ని వేటాడే పోలీస్ ఆఫీసర్ పాత్రలో శ్రీనివాస్ కనిపిస్తున్నారు. ఎమోషనల్, యాంగ్రీ పోలీస్ ఆఫీసర్ గా బెల్లంకొండ నటన బాగుంది. బెల్లంకొండకి ఈ కేసు విషయంలో తోడుగా ఉండే ప్రియురాలిగా అనుపమ చేసినట్లున్నారు. మానసిక వైద్యునిగా సీనియర్ నటుడు సూర్య, బిడ్డను కోల్పోయిన తండ్రి పాత్రలో రాజీవ్ కనకాల టీజర్ లో కనిపించారు.

ఏ స్టూడియోస్ బ్యానర్ పై కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్న ఈ మూవీకి జిబ్రాన్ స్వరాలూ సమకూరుస్తున్నారు.

ట్రైలర్ కోసం క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :

More