వెనక్కి వెళ్లనున్న ‘బెంగాల్ టైగర్’

వెనక్కి వెళ్లనున్న ‘బెంగాల్ టైగర్’

Published on Oct 30, 2015 2:27 AM IST

Bengal-tiger
క్రేజీ సినిమా ‘కిక్’ కి సీక్వెల్ గా వచ్చిన ‘కిక్ 2’ సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో కాస్త బాధ పడిన మాస్ మహారాజ్ రవితేజ ఈ సారి ప్రేక్షకులను మెప్పించాలి అని తన మాస్ మసాలా రూట్ లోనే పర్ఫెక్ట్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా చేసిన సినిమా ‘బెంగాల్ టైగర్’. మాస్ డైరెక్టర్ సంపత్ నంది దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆడియో ఇటీవలే రిలీజ్ అయ్యింది. అలాగే ఆడియో లాంచ్ లో రిలీజ్ అయిన ఈ సినిమా ట్రైలర్ కి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. ఆడియో రిలీజ్ రోజునే సినిమాని నవంబర్ 5న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం అని అనౌన్స్ చేసారు.

కానీ తాజా సమాచారం ప్రకారం బెంగాల్ టైగర్ సినిమాని కొన్ని అనివార్య కారణాల వల్ల అనుకున్నటైం కి రిలీజ్ చేయడం లేదు. కాస్త వెనక్కి వెళ్లి నవంబర్ చివరి వారలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర టీం నవంబర్ 5 తర్వాత బాక్స్ ఆఫీసు కొల్లగొట్టడానికి పర్ఫెక్ట్ రిలీజ్ డేట్ ఏముందా అని ఆలోచిస్తున్నారు. త్వరలోనే రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేస్తారు. రవితేజ మిల్క్ బ్యూటీ తమన్నా, రాశీ ఖన్నాలతో ఆడిపాడిన ఈ సినిమాలో బాలీవుడ్ యాక్టర్ బొమన్ ఇరాని విలన్ గా కనిపించనున్నాడు. భీమ్స్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాకి రాధా మోహన్ నిర్మాత.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు