ఫ్యామిలీ మాన్ 2 వెబ్ సిరీస్ కి బెస్ట్ పెర్ఫార్మెన్స్ అవార్డ్ గెలుపొందిన సమంత!

Published on Aug 20, 2021 7:00 pm IST

భిన్న కథాంశాలతో కూడిన సినిమాలను సెలెక్ట్ చేసుకోవడం మాత్రమే కాకుండా, వెబ్ సిరీస్ లో కూడా తన సత్తా చాటారు సమంత అక్కినేని. ఎంతో క్రేజ్ సొంతం చేసుకున్న ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ కి కొనసాగింపు గా ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ వెబ్ సిరీస్ లో సమంత అక్కినేని రాజీ పాత్రలో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు.

తాజాగా ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ 2021 అవార్డ్ లను ప్రకటించడం జరిగింది. బెస్ట్ పర్ఫార్మెన్స్ ఫిమేల్ వెబ్ సిరీస్ కి గానూ సమంత అక్కినేని అవార్డ్ గెలుపొందింది. సమంత అక్కినేని గెలుపొందిన అవార్డ్ పట్ల అభిమానులు, ప్రేక్షకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :