యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ నటిస్తున్న ‘ఉత్తమ విలన్’ షూటింగ్ మరికొన్ని రోజులలో పూర్తవుతుంది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. నటుడు రమేష్ అరవింద్ ఈ సినిమాకు దర్శకుడు. కమల్ హాసన్ కథ, స్క్రీన్-ప్లే అందించారు. కమల్ సరసన ‘విశ్వరూపం’లో నటించిన హీరోయిన్లు పూజా కుమార్, ఆండ్రియాలు ‘ఉత్తమ విలన్’లో కూడా నటిస్తున్నారు. త్వరలో విడుదల కానున్న ఈ సినిమాపై ప్రేక్షకులలో భారి అంచనాలు ఉన్నాయి.
21వ శతాబ్దంకు చెందిన కళాకారుడు(థియేటర్ ఆర్టిస్ట్) ఉత్తమ్ గా, మనోరంజన్ గా కమల్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. క్లైమాక్స్ 10 నిముషాలు సినిమాకు చాలా కీలకం అని దర్శకుడు రమేష్ అరవింద్ తెలిపారు. క్లైమాక్స్ సన్నివేశాలలో కమల్ నటన అద్బుతం, నటుడిగా తనలో కొత్త కోణాన్ని కమల్ ఆవిష్కరించారు. క్లైమాక్స్ అభిమానులకు సర్ ప్రైజ్ కి గురిచేస్తుందని చెప్పారు.
రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ఫిల్మ్స్, లింగుస్వామి తిరుపతి బ్రదర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలచందర్, కె.విశ్వనాధ్ వంటి ప్రముఖ దర్శకులు నటించారు. జిబ్రాన్ సంగీతం అందించారు.


