హాలీవుడ్ నుండి టాలీవుడ్ కి వస్తోన్న యంగ్ హీరో !

Published on Sep 11, 2019 11:35 am IST

ప్రముఖ దర్శకుడు మారుతి సారధ్యంలో రూపొందిన “భద్రమ్ బి కేర్ ఫుల్ బ్రదరూ” సినిమాతో హీరోగా పరిచయమైన యంగ్ హీరో రాజ్ దాసిరెడ్డి. అయితే తాజాగా ఈ యంగ్ హీరో మరో సినిమా చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. కాగా “భద్రమ్ బి కేర్ ఫుల్ బ్రదరూ” అనంతరం ఒక హాలీవుడ్ సినిమాలో నటించాడు రాజ్. ఆ హాలీవుడ్ ప్రాజెక్ట్ తో బిజీగా ఉండటం కారణంగానే రాజ్ దాసిరెడ్డి “భద్రమ్ బి కేర్ ఫుల్ బ్రదరూ” సినిమా తరువాత వెంటనే తెలుగులో సినిమాలో నటించలేకపోయాడట.

కాగా ఇప్పుడు మాతృభాష పై గల మక్కువతో త్వరలోనే మరో తెలుగు సినిమాకు శ్రీకారం చుట్టనున్నారు రాజ్ దాసిరెడ్డి. హీరో – హీరోయిన్ మినహా దాదాపుగా అందరూ కొత్తవాళ్ళతో రూపొందనున్న ఈ చిత్రం పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని చిత్రబృందం చెబుతుంది. మరి ఈ సినిమాతోనైనా రాజ్ దాసిరెడ్డికి తెలుగులో మంచి హిట్ రావాలని ఆశిద్దాం.

సంబంధిత సమాచారం :

More