అనుష్క ప్రధాన పాత్రలో జి.అశోక్ దర్శకత్వంలో యు.వి. క్రియేషన్స్ నిర్మించిన భాగమతి సినిమా నిన్న విడుదలై మంచి వసూళ్ళు సాధించింది. ఒక్క రోజులో రెండు తెలుగు రాష్టాలు కలిపి 5 కోట్లకు పైన వసూళ్ళు సాధించడం విశేషం. సినిమా విడుదలకు ముందు పెద్దగా అంచానాలు లేనప్పటికీ ఆ స్థాయిలో కలెక్షన్స్ రావడంతో చిత్ర యూనిట్ ఆనందంగా ఉంది.
అరుంధతి, రుద్రమదేవి వంటి లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్‌లను ఖాతాలో వేసుకున్న అనుష్క భాగమతి సినిమాతో మరోసారి తన సత్తా చాటింది. ముందు ముందు ఈ సినిమా వసూళ్ళ పరంగా మరింత ఎక్కువ కలెక్ట్ చేసే అవకాశం ఉంది. అమెరికాలో తెలుగు, తమిళ వెర్షన్స్ నలో మొత్తం 125 స్క్రీన్స్ లో ఈ సినిమా విడుదల అవ్వడం విశేషం.
