‘భగవంత్ కేసరి’ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

Published on Jun 9, 2023 12:13 am IST


నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న లేటెస్ట్ యాక్షన్ మూవీ భగవంత్ కేసరి. ఈ మూవీలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా శ్రీలీల ఒక ముఖ్య పాత్ర చేస్తుంది. బాలీవుడ్ యాక్టర్ అర్జున్ రామ్ పాల్ విలన్ గా నటిస్తున్న ఈ మూవీని షైన్ స్క్రీన్స్ సంస్థ పై హరీష్ పెద్ది, సాహు గారపాటి నిర్మిస్తున్నారు.

ఇప్పటికే ఈ మూవీ నుండి రిలీజ్ అయిన బాలకృష్ణ ఫస్ట్ లుక్ పోస్టర్స్ కి అందరి నుండి మంచి రెస్పాన్స్ లభించింది. కాగా మ్యాటర్ ఏమిటంటే ఈ మూవీ యొక్క ఫస్ట్ లుక్ టీజర్ ని జూన్ 10న బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా గ్రాండ్ గా వరల్డ్ వైడ్ 108 థియేటర్స్ లో విడుదల చేయనున్నట్లు కొద్దిసేపటి క్రితం మేకర్స్ అఫీషియల్ గా ప్రకటించారు. ప్రస్తుతం వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న భగవంత్ కేసరి మూవీని దసరా కానుకగా విడుదల చేయనున్నారు మేకర్స్. దీనికి ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :