కల్కి: రేపు రిలీజ్ కానున్న “భైరవ అంతెం” వీడియో సాంగ్

కల్కి: రేపు రిలీజ్ కానున్న “భైరవ అంతెం” వీడియో సాంగ్

Published on Jun 16, 2024 8:14 PM IST

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ హీరోగా, డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన మైథాలజీ సైన్స్ ఫిక్షన్ మూవీ కల్కి (Kalki2898AD) జూన్ 27, 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో గ్రాండ్ రిలీజ్ కి రెడీ అయిపోయింది. దీపికా పదుకునే, దిశా పటాని ఫీమేల్ లీడ్ రోల్స్ లో నటించిన ఈ చిత్రంలో యూనివర్సల్ స్టార్ హీరో కమల్ హాసన్, బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

ఈరోజు రాత్రి 8:00 గంటలకు భైరవ అంతెంను రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే ఇప్పుడు వీడియో సాంగ్ ను రేపు ఉదయం 11:00 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఇదే విషయాన్ని వెల్లడించడానికి సరికొత్త పోస్టర్ ను విడుదల చేసారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందించిన ఈ చిత్రం ను వైజయంతి మూవీస్ బ్యానర్ పై నిర్మించడం జరిగింది. ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు