ఆర్జీవీ ‘భైరవగీత’ విడుదల తేదీ ఖరారు !

ఆర్జీవీ ‘భైరవగీత’ విడుదల తేదీ ఖరారు !

Published on Oct 24, 2018 12:12 AM IST

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మకి దర్శకుడిగా ఇటు వరుస పరాజయాల ఎదురవుతున్నా, అటు నిర్మాతగా మారి నిర్మిస్తున్న చిత్రం ‘భైరవగీత’. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ట్రైలర్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. కాగా తాజాగా ఈ చిత్రం విడుదల తేదీని కూడా పోస్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించింది చిత్రబృందం. నవంబర్ 22న ఈ సినిమా విడుదల కానుంది.

రాయలసీమ నేపధ్యంలో హింసాత్మక ప్రేమ కథతో ఈ ‘భైరవగీత’ చిత్రం తెరకెక్కింది. ‘తగరు’ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న కన్నడ నటుడు ధనంజయ హీరోగా ఈ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు సిద్దార్థ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ చిత్రానికి దర్శకుడు వేరే అయినప్పటికీ.. ఈ చిత్రం మాత్రం పూర్తిగా వర్మ శైలిలోనే తెరకెక్కినట్లు తెలుస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు