మహేష్ బాబు నటించిన ‘భరత్ అనే నేను’ యూఎస్ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది. మొదటిరోజే రెండున్న మిలియన్లను అందుకున్న ఈ సినిమా నాలుగు రోజులకే 2.5 మిళియన్లను కొల్లగొట్టి బాహుబలి 1, 2ల తర్వాత అంత వేగంగా 2.5 మిలియన్ ను అందుకున్న 3వ చిత్రంగా నిలిచింది.
ఇక తాజా సమాచారం మేరకు ప్రస్తుతం ఈ సినిమా ఇప్పటి వరకు దాదాపు 2.89 మిలియన్ డాలర్లను వసూలు చేసిందని తెలుస్తోంది. దీంతో ఇన్నాళ్లు మహేష్ యూఎస్ బెస్ట్ గ్రాసర్ గా ఉన్న ‘శ్రీమంతుడు’ రికార్డ్ బ్రేక్ అయింది. ఇక రాబోయేది వీకెండ్ కావడంతో ఈ మొత్తం సులభంగానే 3 మిలియన్లను అందుకోనుంది. మొదటిసారి మహేష్ బాబు పొలిటికల్ బ్యాక్ డ్రాప్లో చేసిన ఈ చిత్రాన్ని కొరటాల శివ రూపొందించారు.


