సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన తాజా చిత్రం ‘భరత్ అనే నేను’. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఎంతటి ఘన విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా రూ.180 కొట్లకు పైగానే గ్రాస్ ను వసూలు చేసి మహేష్, కొరటాల శివల కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.
దీంతో మేకర్స్ ఈ చిత్రాన్ని తమిళంలోకి అనువదించాలని నిర్ణయించారు. ప్రస్తుతం డబ్బింగ్ పనులు మొదలవగా విడుదల ఎప్పుడనేది త్వరలోనే తెలియనుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు చెన్నైలో కూడ ఒకేసారి విడుదలైన ఈ చిత్ర తెలుగు వెర్షన్ మంచి గ్రాస్ ను రాబట్టింది. ప్రముఖ నిర్మాత డివివి.దానయ్య నిర్మించిన ఈ చిత్రంలో కైరా అద్వానీ కథానాయకిగా నటించగా మహేష్ బాబు ముఖ్యమంత్రి పాత్రలో అలరించారు.


