విజువల్ ట్రీట్ గా ఉండనున్న ‘భరత్ అనే నేను’ !
Published on Mar 14, 2018 10:32 pm IST

దర్శకుడు కొరటాల శివ తన మూడు సినిమాలు ‘మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్’ లలో టెక్నికల్ టీమ్ బలంగా ఉండేలా చూసుకున్నాడు. ఈ మూడు సినిమాలకు సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్, సినిమాటోగ్రఫర్లు మది, తీరు వంటి పెద్దవాళ్ళనే వాడుకుని అన్ని విధాలా క్వాలిటీ సినిమాల్ని ప్రేక్షకులకు అందించారు. ఆయన సక్సెస్ ఫార్ములాల్లో ఈ పద్దతి కూడ ఒకటని చెప్పొచ్చు.

ప్రస్తుతం మహేష్ బాబుతో చేస్తున్న ‘భరత్ అనే నేను’ కు కూడ ఇదే ఫార్ములాను పాటిస్తున్నారాయన. ఇప్పటికే దేవి చేత బ్రహ్మాండమైన పాటల, నైపథ్య సంగీతాన్ని చేయించుకున్న ఆయన విజువల్ గా కూడ సినిమా గొప్ప స్థాయిలో ఉండేలా సినిమాటోగ్రఫర్లు ఆర్కే చంద్రన్, తిరులతో వర్క్ చేయించుకుంటున్నారు.

ముఖ్యంగా పాటలు విజువల్ ట్రీట్ గా ఉంటాయని తెలుస్తోంది. ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోస్ లో వేసిన కళ్ళు జిగేలుమనే సెట్స్ లో ఒక పాటని చిత్రీకరిస్తున్నారు. దీని తర్వాత యూకే షెడ్యూల్లో ఇంకో రెండు పాటల్ని, కొన్ని సన్నివేశాల్ని చిత్రీకరిస్తారట. దాంతో షూటింగ్ మొత్తం పూర్తికానుంది. భారీ బడ్జెట్ తో డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 20న విడుదలచేయనున్నారు.

 
Like us on Facebook