రేపు శుక్రవారం రెండు సినిమాలు రిలీజ్ కానున్నాయి. వాటిలో ఒకటి నితిన్, కీర్తి సురేష్ జంటగా నటించిన ‘రంగ్ దే’ కాగా మరొకటి రానా చేసిన ‘అరణ్య’. రెండు సినిమాలు కూడ ఎక్కువ థియేటర్లలో విడుదలవుతున్నాయి. ఈ సినిమాల మీద నితిన్, రానాలు బోలెడు ఆశలు పెట్టుకున్నారు. ‘చెక్’ ఫ్లాప్ కావడంతో ఈ సినిమాతో ఎలాగైనా హిట్ ట్రాక్ ఎక్కాలని నితిన్ ఆశగా ఉన్నారు. రానా సైతం కొత్త ప్రయోగాత్మక చిత్రం ‘అరణ్య’ మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నారు.
అంతా బాగానే ఉన్నా రేపు భారత్ బంద్ అనే వార్త రెండు సినిమాలను కంగారు పెడుతోంది. రైతులకు మద్దతుగా దేశంలో ఉన్న అన్ని ప్రాంతీయ రాజకీయ పార్టీలు బంద్ ను విజయవంతం చేయాలని నిర్ణయించాయి. ఉదయం 6 నుండి సాయంత్రం 6 వరకు ఈ బంద్ జరగనుంది. ఈ సంపూర్ణ బంద్ మూలాన సినిమాల ఓపెనింగ్స్ దెబ్బతినే అవకాశం లేకపోలేదు. ఇదే ఆయా చిత్ర బృందాలను కంగారుపెడుతోంది. బంద్ జరిగినా సినిమాల మీద ఎలాంటి ఎఫెక్ట్ చూపకపోతే బాగుండని అందరూ ఆశిస్తున్నారు.


