భారతీయుడు 2 కూడా దిగాడుగా.

Published on Aug 15, 2019 2:00 pm IST

దర్శకుడు శంకర్,లోకనాయకుడు కమల్ హాసన్ కాంబినేషన్ లో వస్తున్న భారీ చిత్రం భారతీయుడు 2. గతంలో వీరిద్దరి కాంబినేషన్ వచ్చి రికార్డ్స్ సృష్టించిన భారతీయుడు చిత్రానికి కొనసాగింపుగా తెరకెక్కుతుంది.లైకా ప్రొడక్షన్స్ తెరకెక్కిస్తున్న ఈ భారీ చిత్రంలో కాజల్ అగర్వాల్,ఐశ్వర్య రాజేష్,ప్రియా భవాని భాస్కర్ హీరోయిన్లుగా నటిస్తుండగా, హీరో సిధార్థ ఓ కీలకపాత్ర చేయనున్నారు.

కాగా నేడు స్వాతంత్ర్య దినాన్ని పురస్కరించుకొని మూవీ యూనిట్ కమల్ హాసన్ ఉన్న చిత్ర పోస్టర్ ని విడుదల చేయడం జరిగింది. గత చిత్రం లో కమల్ సుభాష్ చంద్ర బోస్ స్థాపించిన ఆజాద్ హింద్ ఫౌజ్ సభ్యుడిగా కనిపించాడు. ఈ పోస్టర్ పై కూడా అదే యూనిఫామ్ లో తలెత్తుకుని గర్వంగా నిల్చున్న కమల్ లుక్ ఆసక్తికరంగా ఉంది. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ మూవీ వచ్చే ఏడాది ఏప్రిల్ 14న విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :